Peddapalli: పెద్దపల్లిలో ఘనంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ!

Peddapalli: పెద్దపల్లి ఆర్కే గార్డెన్స్‌లో 63 మందికి రూ.63.07 లక్షల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు.

RAJU, PEDDAPALLI
Published on: 16 Oct 2026 3:08 PM IST
Peddapalli
X

Peddapalli: పెద్దపల్లిలో ఘనంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ!

Peddapalli: పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని ఆర్.కె గార్డెన్స్ లో పెద్దపల్లి పట్టణం, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 63 మంది లబ్ధిదారులకు రూ. 63,07,308/- విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పంపిణీ చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో క్రమం తప్పకుండా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్నామన్నారు. ఎల్ నినో ప్రభావంతో సాగునీటి కొరత ఏర్పడిందని, రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని కోరారు. రైతులకు సాగునీరు కోసం మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి నీరు విడుదల చేయించామన్నారు. మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 10 లక్షల ఆరోగ్యశ్రీ, 500కే గ్యాస్ సిలిండర్, నూతన రేషన్ కార్డులు వంటి పథకాలను అమలు చేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, తహసీల్దార్, సింగిల్ విండో చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI