Peddapalli: రానున్న ఎన్నికల్లోనూ మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే!

Peddapalli: నంది మేడారంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు తీరుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు.

RAMESH, DHARMPURI
Published on: 25 Nov 2026 5:42 PM IST
Peddapalli
X

Peddapalli: రానున్న ఎన్నికల్లోనూ మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే!

Peddapalli: మేము అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాలకే ఇంత హక్కస్ మీకెందుకు.మళ్ళీ అధికారం లోకే మేమే వస్తాము మంత్రి అడ్లూరిపెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలో విలేకరుల సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలో నిర్మించిన రిజర్వాయర్ నుండి ధర్మపురి నియోజకవర్గ రైతులకు ఎందుకు సాగునీటిని అందించలేదనికడుపునిండా కుట్రలు పెట్టుకుని హరీష్ రావు తన ఆవ భావాలతో వ్యంగ్యంగా ముఖ్యమంత్రి గారిపై విమర్శలు చేస్తున్నారని మంత్రి అన్నారు.మరో మరో ముఖ్యమంత్రి గారిపై వ్యంగంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.

ధర్మపురి ప్రజలకు ఎందుకు అన్యాయం చేశారని.. మాజీ నీటిపారుదల శాఖ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నల వర్షం కురిపించారు.రాష్ట్ర ముఖ్యమంత్రిని అవహేళన చేసినట్టు మరో మారు హరీష్ రావు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని హరీష్ రావు ఆరోపిస్తున్నారని అయితే ధర్మపురి నియోజకవర్గంలో నిర్మించిన నంది మేడారం రిజర్వాయర్ నుండి ధర్మపురి నియోజకవర్గానికి ఎందుకు సాగునీటిని అందించలేదని మంత్రి లక్ష్మణ్ కుమార్

ధర్మపురి ప్రజలు ఏమీ అన్యాయం చేశారని మేడారం నుండి మిడ్ మానేరు ద్వారా సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కు నీటిని తరలించుకు వెళ్లారని మంత్రి అన్నారు.... కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ప్రధాన బ్యారేజ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక్క ఎకరానికి సాగునీరు ఇవ్వలేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు

పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తానని మాట ఇచ్చిన కేసీఆర్ ఆ మాట మరిచి ధర్మపురి నియోజకవర్గ రైతాంగానికి తీవ్ర అన్యాయం చేశారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.హరీష్ రావు అన్ని తెలిసిన ఇంజనీర్ల మాట్లాడుతూ. రాష్ట్ర ముఖ్యమంత్రి ని అవహేళన చేసినట్లు మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు.నీటిపారుదల శాఖ మంత్రిగా ఉత్తర, దక్షిణ తెలంగాణలకు తెలంగాణకు అన్యాయం చేసిన హరీష్ రావు కు ప్రజా ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదని అన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చ పెడితే చర్చలో పాల్గొనకుండా పారిపోయారని మంత్రి లక్ష్మణ్ గుర్తు చేశారు.

నందిమేడారం రిజర్వాయర్ నుండి అదనపు టిఎంసి నీటిని తీసుకోవడమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.తెలంగాణలో ప్రజా ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక హరీష్ రావు ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.ఈ మీడియా సమావేశంలో మండలం లోని వివిధ గ్రామాల సర్పంచులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RAMESH, DHARMPURI

RAMESH, DHARMPURI