Veenavanka: మల్లారెడ్డిపల్లి శివాలయం వద్ద నీళ్ల ట్యాంకు ప్రారంభం!
Veenavanka: వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి శివాలయం వద్ద అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.20 వేలతో నిర్మించిన నీళ్ల ట్యాంకును జ్ఞానానంద స్వామి ప్రారంభించారు.
Veenavanka: మల్లారెడ్డిపల్లి శివాలయం వద్ద నీళ్ల ట్యాంకు ప్రారంభం!
కరీంనగర్ జిల్లా: వీణవంక మండలం, మల్లారెడ్డిపల్లి గ్రామంలో గల శివాలయం వద్ద భక్తుల సౌకర్యార్థం దాతల సహకారంతో అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో దాదాపు 20 వేల రూపాయల ఖర్చుతో నీళ్ల ట్యాంకు నిర్మాణం చేసినారు.
ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎలుబాక ప్రణవ ఆశ్రమం భక్తులు జ్ఞానానంద స్వాముల వారు వారి బృందంతో శివాలయం వద్ద భగవద్గీత పారాయణం చేసి అనంతరం నీళ్ల ట్యాంకి ప్రారంభోత్సవం చేసినారు.
ఈ కార్యక్రమానికి వచ్చినభక్తులందరికీ అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ నిర్వహించినారు. ఈ సందర్భంగా అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వ్యవస్థాపక అధ్యక్షులు గోనెల సమ్మన్న ముదిరాజ్ మాట్లాడుతూ ఈ నీళ్లు ట్యాంకు నిర్మాణం కొరకు సహకరించినటువంటి దాతలు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తూ,మేము చేస్తున్న కార్యక్రమాలకు సహకరిస్తున్న వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసినారు.
ఈ కార్యక్రమంలో మల్లారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ మేకల శ్రీనివాస్ రెడ్డి,అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వ్యవస్థాపక అధ్యక్షులు గోనెల సమ్మన్నముదిరాజ్,గౌరవ అధ్యక్షులు కొలిపాక రామస్వామి, ప్రధాన కార్యదర్శి ముద్దసాని శ్రీనివాస్,సంయుక్త కార్యదర్శి బండారి సందీప్,సభ్యులు నల్లవెల్లి శంకర్ 9 వ వార్డు సభ్యులు గంధం ప్రశాంత్,మడ్డి అరుణ, దూలం స్వరూప,.నల్లవెల్లి స్వరూప తదితరులు పాల్గొన్నారు.




