Karimnagar: గురుకుల వార్డెన్ అరుణాదేవి సేవలు భేష్: సునీల్ రావు

Karimnagar: సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్ వార్డెన్‌గా అరుణాదేవి అందించిన 38 ఏళ్ల నిస్వార్థ సేవలు అభినందనీయమని డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు కొనియాడారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 7 Nov 2026 7:18 PM IST
Karimnagar
X

Karimnagar: గురుకుల వార్డెన్ అరుణాదేవి సేవలు భేష్: సునీల్ రావు

కరీంనగర్: కరీంనగర్ భగత్ నగర్ కు చెందిన అరుణాదేవి సాంఘిక సంక్షేమ శాఖలో గురుకుల హాస్టల్ వార్డెన్ గా 38 సంవత్సరాల సుదీర్ఘమైన, నిస్వార్ధమైన సేవలు అందించడం అభినందనీయమని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు.

నగరంలో నిర్వహించిన అరుణాదేవి పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో యాదగిరి సునీల్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణాదేవి- నరసింహస్వామి దంపతులను ఘనంగా సన్మానించి రిటైర్మెంట్ డే విషెస్ తెలియజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అరుణా దేవి 38 సంవత్సరాలు గురుకుల హాస్టల్ వార్డెన్ గా ఎంతోమంది విద్యార్థుల బాగోగులను చూసుకొని ఉన్నతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు.

ఇందులో భగత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తోకల భూమేశ్వర్, వడ్డే శ్రీరామ్ రెడ్డి, చీకోటి గాంధీ, వెంకటేశ్వరరావు, ఎనగందుల వెంకన్న, తదితరులు ఉన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN