Peddapalli: వార్డు సభ్యుల సమస్యలను పరిష్కరించాలి: పెద్దపల్లి కలెక్టరేట్లో వినతి!
Peddapalli: పెద్దపల్లి జిల్లా వార్డు సభ్యుల ఫోరం అధ్యక్షుడు అశోక్ ఆధ్వర్యంలో వార్డు సభ్యులు ప్రజావాణిలో గౌరవ వేతనం, ఎక్స్గ్రేషియా, హెల్త్ కార్డుల కోసం వినతిపత్రం ఇచ్చారు.
Peddapalli: వార్డు సభ్యుల సమస్యలను పరిష్కరించాలి: పెద్దపల్లి కలెక్టరేట్లో వినతి!
Peddapalli: తెలంగాణ రాష్ట్ర వార్డు సభ్యుల ఫోరం అధ్యక్షురాలి పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా వార్డు సభ్యుల ఫోరం అధ్యక్షుడు అశోక్ ఆధ్వర్యంలో వార్డు సభ్యులు పెద్దపల్లి కలెక్టరేట్లోని ప్రజావాణికి చేరుకుని తమ సమస్యలు, న్యాయమైన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. వార్డు సభ్యుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు.
ఈ సందర్భంగా వార్డు సభ్యులు మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర ఎంతో కీలకమని, ప్రజల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నికైన తమకు గ్రామస్థాయిలో కనీస గౌరవం, తగిన ప్రాధాన్యత లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న వార్డు సభ్యులకు తగిన గుర్తింపు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
వార్డు సభ్యులకు నెలవారీ గౌరవ వేతనం చెల్లించాలని, పదవీకాలంలో ఎవరైనా వార్డు సభ్యులు మరణిస్తే వారి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు.
అలాగే వార్డు సభ్యులకు ప్రత్యేక ఆరోగ్య కార్డులు జారీ చేయాలని, గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనుల శిలాఫలకాలపై వార్డు సభ్యుల పేర్లను తప్పనిసరిగా చేర్చాలని కోరారు.




