Karimnagar: వార్డు సభ్యుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి.. అసిఫ్ హబీబ్!
Karimnagar: వార్డు సభ్యులకు గౌరవ వేతనం, ఆరోగ్య బీమా, గుర్తింపు కార్డులు అందించాలని కోరుతూ కరీంనగర్ అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
Karimnagar: వార్డు సభ్యుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి.. అసిఫ్ హబీబ్!
Karimnagar: రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి మహేష్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా వార్డు సభ్యుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించే కార్యక్రమంలో భాగంగా సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు.
కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి అసిఫ్ హబీబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అసిఫ్ హబీబ్ మాట్లాడుతూ, గ్రామపంచాయతీల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వార్డు సభ్యులకు ప్రభుత్వం వెంటనే గౌరవ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల మేనిఫెస్టోలో సైతం గౌరవ వేతనం ఇస్తామని ప్రకటించినందున ప్రభుత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు.
ప్రభుత్వం తక్షణమే గౌరవ వేతనం చెల్లింపు ప్రారంభించడంతో పాటు ఆరోగ్య బీమా, గుర్తింపు కార్డులు, శిక్షణ తదితర న్యాయమైన డిమాండ్లను కూడా పరిష్కరించాలని కోరారు.
వార్డు సభ్యుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకుని సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో తమ హక్కుల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.
కరీంనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి గుర్తూరి మురళి మాట్లాడుతూ, ప్రభుత్వం త్వరలోనే వార్డు సభ్యులకు శుభవార్త చెబుతుందని పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. తప్పకుండా గౌరవ వేతనం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రామడుగు మండల ఇన్‌చార్జి వారాల రాంరెడ్డి, మానకొండూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి బాకరాపు రమేష్, కల్వ మధుబాబు, కొంకటి సునీల్, శానిగారపు అర్జున్, చుక్క రాజు, గొర్రె దేవదాస్, నయిని శంకర్, కట్ల వెంకటేష్, బొల్లవేణి ఓదెలు, డొనాల్డ్ శ్రీధర్, మాట్ల సురేష్, గజుల సదయ్య, పోతునూరి రాజు, గుర్రం శ్రీనివాస్, మామిడి నరేష్, జిట్టవేని ఓదెలు, జెల్ల అజయ్, దుర్గం అంజయ్య, కొక్కిస సతీష్ గౌడ్ తదితర వార్డు సభ్యులు పాల్గొన్నారు.




