Huzurabad: వీణవంకలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలకు హాజరైన వొడితల ప్రణవ్!

Huzurabad: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు, కిష్టంపేట గ్రామాల్లో నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలకు హుజూరాబాద్ కాంగ్రెస్ ఇంచార్జి వొడితల ప్రణవ్ హాజరయ్యారు.

GANESH, JAMMIKUNTA
Published on: 25 Nov 2026 7:21 PM IST
Huzurabad
X

Huzurabad: వీణవంకలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలకు హాజరైన వొడితల ప్రణవ్!

కరీంనగర్ జిల్లా: హుజురాబాద్ నియోజకవర్గవ్యాప్తంగా ఇళ్లు కట్టుకోవాలని కోరుకునే ప్రతి లబ్ధిదారుడికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి ఆదుకుంటున్నామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. కరీనంగర్ జిల్లా వీణవంక మండల పరిధిలో చల్లూరు,కిష్టంపేట గ్రామాల్లో నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలకు ముఖ్యఅతిథిగా ప్రణవ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా కిష్టంపేటలో మొదటి విడతలో 9 ఇళ్లు మంజూరు కాగా పూర్తి స్థాయిలో నిర్మాణాలు పూర్తి అయ్యి గృహ ప్రవేశాలు చేసుకున్నారని ఇళ్లు కట్టుకోవాలనే సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని అన్నారు. మొదటి విడతతో పాటు రెండవ విడతలో మరిన్ని ఇళ్లు ఇచ్చి ఇళ్లు కట్టుకోవాలి అనుకునే వారి కలను నెరవేరుస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలోసర్పంచులు,వీణవంక మండల నాయకులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA