Peddapalli: గంగారంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు!

Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు. సంఘం భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే విజయ రమణారావుకు కృతజ్ఞతలు.

Srimanthula Kondal, Peddapalli
Published on: 17 Sept 2026 3:21 PM IST
Peddapalli
X

Peddapalli: గంగారంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు!

Peddapalli: పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గంగారం గ్రామంలో విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ధరణి మణికంఠ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలవేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విశ్వకర్మ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమనికి సర్పంచ్ రేకుల జ్యోతి రఘ, ఉప సర్పంచ్ మేడి అశోక్ గౌడ్ హాజరైయారు.సర్పంచ్, ఉప సర్పంచ్ లను విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ధరణి మణికంఠ మాట్లాడుతూ విశ్వకర్మతోనే సృష్టి ఉద్భవించిందని విశ్వకర్మ జయంతిని పండుగలా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు విశ్వకర్మ జయంతి విశ్వబ్రాహ్మణులు కాకుండా ప్రతి ఒక్కరు జరుపుకోవాలని వారు కోరారు గంగారం గ్రామంలో విశ్వబ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో భూమి కొనుగోలు చేసుకున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే భవన నిర్మాణానికి ఐదు లక్షలు మంజూరు చేశారని మరో 10 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారన్నారు. భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ధరణి మణికంఠ అచర్య,ఉప ఉపాధ్యక్షులు గడ్డం వెంకటేశ్వర్లు,ప్రధాన కార్యదర్శి పోలోజ్ శ్రీనివాస్ క్యాషియర్, రంగు సదానందం కార్యదర్శి శ్రీరామోజు వెంకటేశ్వర్లు,ప్రచార కార్యదర్శి కనుక చారి,గౌరవ సలహాదారులు కందుకూరి రాజన్న సభ్యులు బొజ్జ వెంకటేశ్వర్లు ధరణి బిక్షపతి రంగు నారాయణ సేపూరి రవీంద్రాచారి రావుల సంపత్ సేపూరి సుమన్ కందుకూరి రవి కిరణ్ మాజీ సర్పంచ్ ఈధ సత్యనారాయణ రెడ్డి గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli