Kalva Srirampur: ప్రజల హక్కుల పరిరక్షణే నా లక్ష్యం: విజయసాగర్!
Kalva Srirampur: వినియోగదారుల, మానవ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కల్లపెల్లి విజయసాగర్ నియామకం. హక్కుల సాధనకు శ్రమిస్తానని వెల్లడి.
Kalva Srirampur: ప్రజల హక్కుల పరిరక్షణే నా లక్ష్యం: విజయసాగర్!
Kalva Srirampur: వినియోగదారుల హక్కుల పరిరక్షణ,ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న వినియోగదారుల,మానవ హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కల్లపెల్లి విజయసాగర్ నియమితులయ్యారు.సంస్థ జాతీయ అధ్యక్షుడు ఆర్.కె.జైన్ ఈ మేరకు నియామక ఉత్తర్వులు జారీ చేయగా,రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ సహారా బాను సూచనలతో నియామకం ఖరారైంది.
ఈ సందర్భంగా విజయసాగర్ మాట్లాడుతూ..ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి,వాటిని సంబంధిత ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.వివిధ శాఖల అధికారులు ప్రజా సమస్యల పరిష్కారంలో స్పందించని సందర్భాల్లో బాధితులకు అండగా నిలిచి,అధికారులతో సమన్వయం ద్వారా న్యాయం జరిగేలా ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.
వినియోగదారుల హక్కులు, మానవ హక్కులపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు,బాధితులకు ఫిర్యాదుల ప్రక్రియపై మార్గనిర్దేశం చేస్తానన్నారు. ప్రజా సమస్యలపై సంబంధిత శాఖలకు వినతిపత్రాలు అందించడం,హక్కుల ఉల్లంఘనకు గురైన వారికి చట్టబద్ధమైన మార్గాల్లో సహకరించడం,సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయడం తన ప్రాధాన్యాలని వివరించారు.
తనకు రాష్ట్రస్థాయి బాధ్యతలు అప్పగించిన సంస్థ జాతీయ అధ్యక్షుడు ఆర్.కె.జైన్,తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ సహారా బానులకు విజయసాగర్ కృతజ్ఞతలు తెలిపారు.సంస్థ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రజల హక్కుల పరిరక్షణకు అంకితభావంతో కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.




