Manthani: రామగిరి రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ మట్టి తవ్వకాలు విజిలెన్స్‌కు ఫిర్యాదు!
Manthani: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఆదివారంపేట రిజర్వ్ ఫారెస్ట్‌లో అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు, చెట్ల నరికివేతపై విజిలెన్స్‌కు ఫిర్యాదు చేశారు.
Manthani: రామగిరి రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ మట్టి తవ్వకాలు విజిలెన్స్‌కు ఫిర్యాదు!
Manthani: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఆదివారంపేట గ్రామ సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ భూమిలో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలు, చెట్ల నరికివేత జరుగుతోందంటూ మంథనికి చెందిన పుట్ట ముకేష్ తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగానికి ఫిర్యాదు చేసినట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆదివారంపేట రిజర్వ్ ఫారెస్ట్ లో మెఘా ఇంజనీరింగ్ సంస్థ సంబంధిత అనుమతులు లేకుండా భారీ స్థాయిలో మట్టి తవ్వకాలు జరిపి, చెట్లను తొలగించి తరలిస్తోందని, సింగరేణి ఓసీ-2, ఓసీ-3 పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఓబీ మట్టిని తరలిస్తున్నారని, ఈడీ మైన్స్ అండ్ జియాలజీ, పెద్దపల్లి అధికారుల సహకారంతో ఈ తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపణ, గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో సింగరేణి బ్లాస్టింగ్ ద్వారా తొలగించిన, బొగ్గు కలిసిన నాసిరకం మట్టి (గ్రావెల్) ను రోడ్డు నిర్మాణం, స్ట్రెంతెనింగ్ పనులకు వాడుతున్నారని, ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక సబ్ కాంట్రాక్టర్ ను నియమించి, అనుభవం లేని వారితో పనులు చేయిస్తూ నాణ్యతా ప్రమాణాలు, టెండర్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ వ్యవహారంలో ఇంజనీరింగ్, మైనింగ్, అటవీ శాఖ అధికారుల పాత్రపైనా సమగ్ర విచారణ జరపాలని, అక్రమంగా తరలించిన మట్టి, తొలగించిన చెట్లకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించి ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని, బాధ్యులైన సంస్థలు, అధికారులు, కాంట్రాక్టర్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.




