Illanthakunta: వెంకట్రావుపల్లిలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
Illanthakunta: రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకట్రావుపల్లిలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్యాక్స్ చైర్మన్ వుట్కూరి వెంకట రమణారెడ్డి హాజరై పూజలు చేశారు.
Illanthakunta: వెంకట్రావుపల్లిలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఇల్లంతకుంట మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ప్యాక్స్ చైర్మన్ వుట్కూరి వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గాదేవి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు, రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల జీవన విధానంలో బతుకమ్మకు ప్రత్యేక స్థానం ఉందన్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఎల్లప్పుడూ వర్ధిల్లాలని, ప్రతి ఆడపడుచు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ మన సంస్కృతికి ప్రతీక అని, తెలంగాణ మన ఆత్మగౌరవమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ముస్కానిపేట సర్పంచ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముక్కిస భాస్కర్ రెడ్డి, ఎస్ఐ ఉపేంద్ర చారి, వెంకట్రావుపల్లి సర్పంచ్ చల్లా నవీన్ రెడ్డి, ఉప సర్పంచ్ అనగోని అవినాష్ గౌడ్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కనకరాజు, పాలకవర్గ సభ్యులు, మండల ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




