Vemulawada: 80 ఫీట్ల రోడ్డు పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రూ.6.5 కోట్ల రోడ్డు పనులను విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Vemulawada: 80 ఫీట్ల రోడ్డు పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Vemulawada: వేములవాడ పట్టణంలో జరుగుతున్న 80 ఫీట్ల రోడ్డు పనులను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్... హాజరైన మున్సిపల్ పాలకవర్గం అధికారులు ప్రజలు.. పనులు పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించిన విప్...
కామెంట్స్
రాజన్న ఆలయం, వేములవాడ పట్టణ అభివృద్ధి రెండు కళ్లలాంటివి ప్రజా ప్రభుత్వంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోంది.
వేములవాడను ఆధ్యాత్మిక కేంద్రంగా, టెంపుల్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు సుమారు రూ.250 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యాయి.
ఆలయ అభివృద్ధి పనులు సుమారు 55 శాతం, అన్నదాన సత్రం పనులు 50 శాతం వరకు పూర్తయ్యాయి. అదనంగా రూ.99.40 కోట్ల నిధులు మంజూరు చేయడంతో మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాం.
దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వేములవాడ 80 అడుగుల రహదారి విస్తరణ పనులు తుది దశకు చేరుకుంటున్నాయి. రహదారి నిర్మాణానికి సుమారు రూ.6.5 కోట్లతో పాటు విద్యుత్ స్తంభాలు, లైటింగ్ ఏర్పాట్లకు నిధులు కేటాయించాం.
రహదారి విస్తరణకు సంబంధించి రూ.47 కోట్ల జీవో తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపట్టాం. నిర్వాసితుల సహకారం, త్యాగాల వల్లే ఈ అభివృద్ధి సాధ్యమవుతోంది.
80 అడుగుల రహదారి నిర్మాణ పనులను మున్సిపల్ పాలకవర్గం, ఆర్అండ్బీ అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించాం.
రహదారి నిర్మాణంలో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని అధికారులకు ఆదేశించాం. రహదారి దీర్ఘకాలం మన్నికగా ఉండేలా సాంకేతిక ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలి.
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మూడో బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేశాం. గతంలో శంకుస్థాపనకే పరిమితమైన పనులను ముందుకు తీసుకెళ్లి ప్రజలకు ఉపయోగపడేలా పూర్తి చేయడంపై దృష్టి పెట్టాం.
అభివృద్ధి పనులు కొనసాగుతున్న సమయంలో బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అన్నదాన సత్రానికి సంబంధించి రూ.35 కోట్లతో పాటు దేవాలయ అభివృద్ధికి రూ.51 కోట్లకు పైగా నిధులు విడుదల చేసాము.
రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల పునరుద్ధరణ, విస్తరణ, జీర్ణోద్ధరణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధికి సుమారు రూ.2,000 కోట్లకు పైగా నిధులు కేటాయించడం జరిగింది.
భక్తుల విశ్వాసాలు, సనాతన సంప్రదాయాలను గౌరవిస్తూ ఆధ్యాత్మిక కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నాం. 2015 జూన్ 18న కేసీఆర్ వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి ఏటా రూ.100 కోట్లు ఇస్తామని చెప్పి రాజన్న భక్తులను మోసం చేశారు...
రాజన్న ఆలయ అభివృద్ధి పనులు ఆగమ శాస్త్ర నియమాలకు అనుగుణంగా జరగాలని ప్రభుత్వం భావిస్తోంది. శృంగేరి పీఠాధిపతి సూచనలను పరిగణనలోకి తీసుకొని భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్మాణాలు చేపడుతున్నాం.
వేములవాడ రాజన్న ఆలయం, పట్టణ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించి నిధులు మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు. రాబోయే రోజుల్లోనూ అవసరమైన నిధులను తీసుకొచ్చి వేములవాడను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం.
రాజన్న భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ వేములవాడను ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. రాజన్న ఆలయ అభివృద్ధి ఒకవైపు.. వేములవాడ పట్టణ అభివృద్ధి మరోవైపు.. ఈ రెండింటినీ రెండు కళ్లలా భావించి ముందుకు
తీసుకెళ్తున్నాం. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న 80 అడుగుల రహదారి కల నెరవేరుతోంది. నిర్మాణ పనుల్లో నాణ్యతకు ఎక్కడా రాజీ పడకుండా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం.




