Vemulawada: వేములవాడలో ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి'

Vemulawada: వేములవాడ 22వ వార్డు, మల్లారంలో లబ్ధిదారులతో కలిసి ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకల్లో పాల్గొన్న విప్ ఆది శ్రీనివాస్. వేములవాడకు 5,500 ఇళ్లు మంజూరు.

BABU, VEMULAWADA
Published on: 8 Nov 2026 4:18 PM IST
Vemulawada
X

Vemulawada: వేములవాడలో ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి'

వేములవాడ: వేములవాడ పట్టణంలో 22 వార్డు, రూరల్ మండలం మల్లారం గ్రామంలో మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు. ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారుల ఇంట్లో లబ్దిదారులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరైన అడిషనల్ కలెక్టర్ నగేష్, ప్రజా ప్రతినిధులు.

మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి పేదల సొంతింటి కలను సాకారం చేసిన ప్రజా ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.

జీవితాంతం సొంతింటి కోసం ఎదురుచూసిన పేద కుటుంబాలు నేడు తమ సొంత ఇంట్లో దీపావళి పండుగ జరుపుకోవడం ఎంతో సంతోషకరం. ఒకప్పుడు కష్టాల మధ్య పాత ఇళ్లలో జీవించిన నిరుపేద కుటుంబాలు.. నేడు ఇందిరమ్మ ప్రభుత్వ సహకారంతో సొంతింటి యజమానులుగా మారారు.

లబ్ధిదారుల కళ్లల్లో కనిపిస్తున్న ఆనందబాష్పాలు, వారి కుటుంబాల్లో వెల్లివిరుస్తున్న సంతోషం ఇందిరమ్మ పాలనకు నిదర్శనం. దసరా పండుగను సొంతింట్లో జరుపుకున్న కుటుంబాలు.. నేడు దీపావళి పండుగను కూడా తమ సొంత గృహాల్లో జరుపుకుంటున్నాయి. ఇది వారి జీవితాల్లో మరచిపోలేని మధుర జ్ఞాపకం.

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను నిజం చేయాలనే సంకల్పంతో ఒక్కో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నాం. వేములవాడ నియోజకవర్గంలో ఇప్పటికే 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా, తాజాగా మరో 2,000 ఇళ్లను రెండో విడతలో అందించే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల ద్వారా సొంతింటి కలను సాకారం చేసే బృహత్తర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేపట్టాం. పేదల సంక్షేమం, సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పనిచేస్తోంది. గరీబీ హటావో నుంచి నేటి ఇందిరమ్మ ఇళ్ల వరకు పేదల పక్షాన నిలిచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది.

గతంలో ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు ఇళ్ల నిర్మాణానికి పెద్దపీట వేస్తే.. నేడు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అదే స్ఫూర్తితో పేదల సొంతింటి కలను నెరవేరుస్తోంది. దీపావళి పండుగతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం కూడా కావడం ప్రత్యేకం. పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయురారోగ్యాలతో ఉండాలని, వారి నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను. రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తూ, సొంతింటి కలను నెరవేర్చే దిశగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుంది.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA