Vemulawada: రాజన్న 2027 క్యాలెండర్ ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్!

Vemulawada: వేములవాడ భీమేశ్వరాలయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి నూతన సంవత్సర క్యాలెండర్-2027ను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఘనంగా ఆవిష్కరించారు.

BABU, VEMULAWADA
Published on: 6 Nov 2026 12:16 PM IST
Vemulawada
X

Vemulawada: రాజన్న 2027 క్యాలెండర్ ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్!

Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం నూతన సంవత్సర క్యాలెండర్-2027ను అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో వేములవాడ శాసనసభ్యులు, గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆది శ్రీనివాస్ గారు ఆవిష్కరించారు.

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ... శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం తరఫున భక్తులకు అందజేసేందుకు ఒక్కో క్యాలెండర్‌ను రూ.100 చొప్పున అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ క్యాలెండర్‌లో నక్షత్రాలు, ఏకాదశి తిథులు, ఉగాది పండుగ ముహూర్తాలతో పాటు ఆలయానికి సంబంధించిన సమగ్ర సమాచారం, పూజా వివరాలు పొందుపరిచారని పేర్కొన్నారు. క్యాలెండర్ ప్రాముఖ్యతను తెలియజేస్తూ, మొదటి 21 క్యాలెండర్లను విప్ గారే స్వయంగా కొనుగోలు చేశారు.

​అంతకుముందు భీమేశ్వరాలయానికి చేరుకున్న ప్రభుత్వ విప్ గారికి ఆలయ అర్చకులు, వేద పండితులు స్వస్తి వచనాలతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి గారు, డిఈవో శ్రీ ప్రతాప నవీన్ కుమార్ గారు శేషవస్త్రం, స్వామివారి లడ్డూ ప్రసాదాలను విప్ గారికి అందజేశారు.

​ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవోలు, సూపరింటెండెంట్లు, ఆలయ ఉద్యోగులు, వేద పండితులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA