Vemulawada: బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులు
Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట ప్రభుత్వ పాఠశాలలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు.
Vemulawada: బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులు
వేములవాడ: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని బావు సాయి పేట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఒకరోజు ఉపాధ్యాయులుగా మారి తరగతి గదుల్లో తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయులుగా మారి చక్కగా బోధించిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఉపసర్పంచ్ గారు, గ్రామ ప్రముఖులు బహుమతులుగా కంపాస్ బాక్సులు, కలర్ పెన్సిల్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.




