Vemulawada: రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయాలి!
Vemulawada: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశించారు.
Vemulawada: రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయాలి!
వేములవాడ: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశించారు. వేములవాడ పట్టణంలో వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (వీటీఏడీఏ) ఆద్వర్యంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తరణ, అభివృద్ధి పనుల పై భీమేశ్వర స్వామి ఆలయ గెస్ట్ హౌస్ లో శనివారం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఆర్ అండ్ బీ సీఈ రాజేశ్వర్ రెడ్డి, ఆర్కిటెక్ట్, ధార్మిక సలహాదారుతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించి.
ఇప్పటి వరకు పూర్తి చేసిన పనులపై ఆరా తీశారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనుల్లో ప్రతి దానికి గడువు విధించి.. పూర్తి చేస్తూ ముందుకు వెళ్లాలని ఆదేశించారు. పనులకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను మరింత పెంచాలని సూచించారు. ప్రణాళిక ప్రకారం అన్ని పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.




