Vemulawada: వేములవాడ అనుబంధ ఆలయాల్లో అడిషనల్ కమిషనర్ పూజలు!
Vemulawada: వేములవాడ అనుబంధ ఆలయాలైన శ్రీ భీమేశ్వర స్వామి, శ్రీ బద్ది పోచమ్మ అమ్మవార్లను దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Vemulawada: వేములవాడ అనుబంధ ఆలయాల్లో అడిషనల్ కమిషనర్ పూజలు!
వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయాలైన శ్రీ భీమేశ్వర స్వామివారిని, శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారిని దేవాదాయ ధర్మాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ ( ఎండోమెంట్ ట్రిబ్యునల్ ) శ్రీమతి కృష్ణవేణి గారు మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయానికి విచ్చేసిన వారికి అర్చకులు, వేద పండితులు స్వస్తితో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి గారు, శేషవస్త్రాలు స్వామివారి ప్రసాదాలను అందజేసి సత్కరించారు.




