Vemulawada: వేములవాడ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న శ్రీశైల జగద్గురు!

Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామివారిని శ్రీశైల జగద్గురు డాక్టర్ చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వాములు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

BABU, VEMULAWADA
Published on: 25 Nov 2026 1:23 PM IST
Vemulawada
X

Vemulawada: వేములవాడ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న శ్రీశైల జగద్గురు!

వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారిని శ్రీశైల జగద్గురు సూర్య సింహాసన పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ 1008 జగద్గురు డా. చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వాములు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ​ఆలయానికి విచ్చేసిన మహాస్వాములకు ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.

అనంతరం శ్రీ భీమేశ్వర స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ​పూజల అనంతరం స్వామివారి మండపంలో ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) శ్రీమతి ఎల్. రమాదేవి గారు, ఆలయ అర్చకులు, వేద పండితులు మహాస్వాముల వారికి స్వామివారి శేషవస్త్రము, లడ్డూ ప్రసాదము, పండ్లను అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు, భక్తులు మహాస్వాముల వారి ఆశీర్వచనం పొందారు. ​ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, వేద పండితులు, అర్చకులు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA