Vemulawada: వేములవాడ రాజన్న అన్నదాన ట్రస్ట్‌కు లక్షా ఒక్క రూపాయి విరాళం!
Vemulawada: వేములవాడ రాజన్న దేవస్థానం అన్నదాన ట్రస్ట్‌కు రూ. 1,00,001 విరాళం అందజేసిన దంపతులు వేముల సువర్ణ - నాగరాజు. ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు.
Vemulawada: వేములవాడ రాజన్న అన్నదాన ట్రస్ట్‌కు లక్షా ఒక్క రూపాయి విరాళం!
Vemulawada: వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అన్నదాన ట్రస్టుకు వరంగల్‌కు చెందిన వేముల సువర్ణ - నాగరాజు దంపతులు ₹1,00,001/- (లక్ష ఒక రూపాయి) నగదును విరాళంగా అందించారు.
బుధవారం ఆలయ ప్రోటోకాల్ కార్యాలయంలో పిఆర్ఓ పెరిక శ్రీనివాస్‌కు వారు ఈ విరాళం నగదు రూపంలో అందజేశారు.
అనంతరం స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి, కోడె మొక్కును చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు దంపతులకు వేదాశీర్వచనం తో పాటు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.




