Vemulawada: వేములవాడ ఈవో కి కొండగట్టు అంజన్న ఉత్సవాల ఆహ్వాన పత్రిక అందజేత!
Vemulawada: కొండగట్టు అంజనేయస్వామి ఆలయ చందనోత్సారణ, మహా సంప్రోక్షణ మహోత్సవాల ఆహ్వాన పత్రికను వేములవాడ ఈవో రమాదేవికి అందజేసిన అధికారులు. నవంబర్ 15 నుంచి ఉత్సవాలు.
Vemulawada:వేములవాడ ఈవో కి కొండగట్టు అంజన్న ఉత్సవాల ఆహ్వాన పత్రిక అందజేత!
Vemulawada: జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం (కొండగట్టు)లో త్వరలో జరగనున్న 'చందనోత్సారణ (చందనం తొలగింపు) - మహా సంప్రోక్షణ' మహోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం (వేములవాడ) ఈవో శ్రీమతి ఎల్. రమాదేవి గారికి కొండగట్టు దేవస్థానం అధికారులు ఘనంగా అందజేశారు.
కొండగట్టు ఆలయ ఏఈఓ హరిహరనాథ్, ఆలయ ఉప ప్రధాన అర్చకులు శ్రీ లక్ష్మణ ప్రసాద్ గార్లు వేములవాడలో ఈవో రమాదేవిని కలసి ఆహ్వాన పత్రికను అందజేసి ఉత్సవాలకు ఆహ్వానించారు.
ఉత్సవాల వివరాలు:
స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సరం కార్తీక శుద్ధ షష్ఠి, తేదీ: 15-11-2026 (ఆదివారం) నుండి 20-11-2026 (శుక్రవారం) వరకు శ్రీశ్రీశ్రీ జీయర్ స్వాములవారి దివ్య సమక్షంలో మహా వైభవంగా ఈ కార్యక్రమాలు జరగనున్నాయి.
60 సంవత్సరాల తర్వాత విశేష ఘట్టం గత 60 ఏళ్లుగా స్వామివారి మూలమూర్తిపై పేరుకుపోయిన చందనాన్ని తొలగించే (చందనోత్సారణ) ప్రక్రియ, అనంతరం మహా సంప్రోక్షణ మహోత్సవం నిర్వహించనున్నారు.
జపాలు, హోమాలు: తేదీ 15-11-2026 నుండి 20-11-2026 వరకు క్షేత్రంలో విశేష హోమాలు, జపాలు, వేద పారాయణాలు జరుగుతాయి.
దర్శనాల వివరాలు:
చందనోత్సారణ ప్రక్రియ జరుగుచున్నందున ఉత్సవాల సమయంలో మూలమూర్తి దర్శనం ఉండదు.
తేదీ: 20-11-2026 (శుక్రవారం) ఉదయం 9:57 గంటలకు శ్రీశ్రీశ్రీ జీయర్ స్వాములవారిచే కుంభ ప్రోక్షణ, మహా సంప్రోక్షణ పూర్తయిన అనంతరం శ్రీస్వామివారి నిజరూప దర్శనం ప్రారంభమవుతుంది.
భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం 29-12-2026 (మంగళవారం) వరకు అంటే మొత్తం 40 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది.
ఈ పవిత్ర మహోత్సవంలో భక్తులందరూ విశేషంగా పాల్గొని శ్రీ అంజనేయస్వామివారి కృపాకటాక్షాలు పొందాలని ఆలయ అధికారులు కోరారు.




