Vemulawada: ఇంట్లో శవం.. ఆస్తి కోసం తలకొరివి రగడ: వేములవాడ!

Vemulawada: వేములవాడ కోనాయిపల్లిలో వృద్ధుడి మృతదేహం సాక్షిగా ఆస్తి కోసం కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది.

BABU, VEMULAWADA
Published on: 14 Oct 2026 2:36 PM IST
Vemulawada
X

Vemulawada: ఇంట్లో శవం.. ఆస్తి కోసం తలకొరివి రగడ: వేములవాడ!

వేములవాడ: పార్థివ దేహాన్ని నటింట్లోనే పెట్టుకొని ఆస్తికోసం గొడవపడి మానవత్వాన్ని మంటగలిపిన వ్యవహారం వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పురపాలక సంఘం పరిధిలోని 13వ వార్డు కోనాయిపల్లి లో కొంకటి చంద్రయ్య (80) వృద్ధుడు సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు.

మృతుని భార్య పోచవ్వ కూడా గత మూడు నాలుగు సంవత్సరాల క్రితమే మృతి చెందింది. అయితే వీరికి ఒక కుమారుడుతో పాటు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. కుమారుడు నాగరాజుకు రెండు వివాహాలు కాగా మొదటి మొదటి భార్యకు కుమారుడు ఉండగా, రెండవ భార్యకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

అయితే కుమారుడు నాగరాజు కూడా గత కొద్ది సంవత్సరాల క్రితమే మృతి చెందారు. మృతుడు బొంబాయిలో పని చేస్తూ అక్కడ ఒక ఇంటిని కూడా సంపాదించగా స్వగ్రామంలోనూ దాదాపు నాలుగున్నర ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు.

ప్రస్తుతం స్వగ్రామంలో ఒక ఎకరం నర వ్యవసాయ భూమి ఇల్లు కూడా ఉంది. ప్రస్తుతం రెండవ భార్య అతని కూతుర్లు వృద్ధులకు సేవ చేస్తూ వస్తుండగా చంద్రయ్య మృతి చెందడంతో ఆస్తి వివాదం తలెత్తింది. మొదటినుండి ఇంటి దగ్గరే ఉండి సేవ చేస్తున్న తమకి అవకాశం కల్పించాలని రెండవ భార్య అతని కూతుర్లు తలకొరిమి పెట్టేందుకు పట్టుబడుతున్నారు.

మృతుని కూతుర్లు మాత్రం మొదటి భార్య కొడుకుకు అవకాశం ఇయ్యాలని మొండి పట్టు పట్టారు. గ్రామస్తులు కూడా రెండవ భార్యకే చెందాలని మొదటినుంచి ఆమె సేవ చేస్తున్నందున ఆస్తి ఆమెకే ఇవ్వాలన్నట్లుగా మద్దతు ఇచ్చారు. ఇంట్లో మృతదేహం ఉండగానే ఆస్తికోసం గొడవ పడుతుండడంతో పోలీసులకు ఫిర్యాదు అందింది.

దీంతో మృతుని బంధువులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ చేరుకోవడంతో పోలీసులు వారిని మందలించారు. ఆస్తి కోసమే తలకొరిమి పెట్టేందుకు గొడవ పడుతున్న వ్యవహారం పట్టణంలో చర్చనీ అంశంగా మారింది.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA