Vemulawada: భీమేశ్వరాలయంలో వైభవంగా సామూహిక కార్తీక దీపోత్సవం

Vemulawada: వేములవాడ అనుబంధ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో 15వ రోజు సామూహిక కార్తీక దీపోత్సవం ప్రారంభం; డిసెంబర్ 8 వరకు రోజువారీ పూజలు, వాయన అందజేత.

BABU, VEMULAWADA
Published on: 25 Nov 2026 10:07 PM IST
Vemulawada
X

Vemulawada: భీమేశ్వరాలయంలో వైభవంగా సామూహిక కార్తీక దీపోత్సవం

వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న సామూహిక కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో భాగంగా, బుధవారం 15వ రోజు వేడుకలను ఆలయ పర్యవేక్షకులు నరేందర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

నవంబర్ 10 నుండి డిసెంబర్ 8వ తేదీ వరకు కొనసాగనున్న ఈ పవిత్ర కార్తీక మాస పర్వదినాల సందర్భంగా, ప్రతిరోజూ సాయంత్రం 6:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు సుహాసినుల ఆధ్వర్యంలో అత్యంత భక్తిశ్రద్ధలతో సామూహిక దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్న మహిళా భక్తులు, శ్రీ రాజరాజేశ్వరి సేవాసమితి సభ్యులకు ఆలయ అర్చకులు, అధికారులు పసుపు, కుంకుమ, అక్షింతలు, గాజులు, వాయనంతో పాటు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ వేడుకల్లో ఆలయ పర్యవేక్షకులు, వేద పండితులు, అర్చకులు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA