Vemulawada: హనుమాజీపేట ఎల్లమ్మ ఆలయంలో హుండీ దొంగతనానికి విఫలయత్నం!

Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా హనుమాజీపేట ఎల్లమ్మ ఆలయంలో దొంగతనానికి విఫలయత్నం. బండరాయితో హుండీ పగులగొట్టే యత్నం.. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు.

BABU, VEMULAWADA
Published on: 28 Oct 2026 3:22 PM IST
Vemulawada
X

Vemulawada: హనుమాజీపేట ఎల్లమ్మ ఆలయంలో హుండీ దొంగతనానికి విఫలయత్నం!

Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలం హనుమాజీపేట గ్రామంలోని ఎల్లమ్మ ఆలయంలో అర్ధరాత్రి దొంగతనానికి విఫలయత్నం జరిగింది. హుండీని పగులగొట్టేందుకు ప్రయత్నించిన గుర్తుతెలియని వ్యక్తి, విఫలమై అక్కడి నుంచి పరారయ్యాడు.

మంగళవారం అర్ధరాత్రి హనుమాజీపేట గ్రామంలోని ఎల్లమ్మ ఆలయంలోకి ప్రవేశించిన గుర్తుతెలియని వ్యక్తి, బండరాయితో హుండీని పగులగొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే ఎంత ప్రయత్నించినా హుండీ తెరుచుకోకపోవడంతో తన ప్రయత్నాన్ని విరమించుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఆలయంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ఈ విషయాన్ని గుర్తించిన ఆలయ కమిటీ అధ్యక్షుడు తీగల శ్రీనివాస్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టే అవకాశం ఉంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించే ప్రయత్నాలు చేయాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA