Vemulawada: వేములవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

Vemulawada: వేములవాడ రూరల్ తహసీల్దార్ అబూబాకర్, జీపీఓ అనిల్ రూ.8 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.

BABU, VEMULAWADA
Published on: 15 Oct 2026 7:34 PM IST
Vemulawada
X

Vemulawada: వేములవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం సాయంత్రం దాడులు నిర్వహించారు. భూ సంబంధిత పనికి లంచం తీసుకుంటుండగా తహసీల్దార్ అబూబాకర్, కార్యాలయ జీపీఓ అనిల్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ మహేందర్ రెడ్డి వెల్లడించారు.

ఏసీబీ డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా నూకలమర్రి గ్రామానికి చెందిన ఓ బాధితుడు తన పేరిట భూమిని మ్యుటేషన్ చేయించుకునేందుకు వేములవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయాన్ని పలుమార్లు సంప్రదించినట్లు తెలిపారు.

అయినప్పటికీ పని పూర్తికాకపోవడంతో విసిగిపోయిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ప్రణాళిక ప్రకారం నిఘా ఏర్పాటు చేశారు. బాధితుడి నుంచి జీపీఓ అనిల్ ద్వారా రూ.8,000 లంచం తీసుకుంటున్న సమయంలో తహసీల్దార్ అబూబాకర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు డీఎస్పీ మహేందర్ రెడ్డి తెలిపారు.

అనంతరం కార్యాలయంలో సోదాలు నిర్వహించి, ఈ వ్యవహారానికి సంబంధించి ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అరెస్టు చేసిన నిందితులను శుక్రవారం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA