Karimnagar: సిరిసిల్ల సీఎం సభకు వేలాదిగా తరలివెళ్తాం: వెలిచాల రాజేందర్‌రావు!

Karimnagar: సిరిసిల్ల సీఎం రేవంత్‌రెడ్డి సభకు కరీంనగర్ నుంచి భారీగా తరలివెళ్తాం కాంగ్రెస్ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు విప్ ఆది శ్రీనివాస్‌తో భేటీ, ఏర్పాట్లపై చర్చ.

CH Gopalakrishna, Regional Coordinator -Karimnagar
Published on: 28 Sept 2026 10:39 PM IST
Karimnagar
X

Karimnagar: సిరిసిల్ల సీఎం సభకు వేలాదిగా తరలివెళ్తాం: వెలిచాల రాజేందర్‌రావు!

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 28: ఈనెల 30న సిరిసిల్లలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి పాల్గొనే భారీ బహిరంగ సభకు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వేలాదిమందితో తరలివెళ్లనున్నట్లు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, రైతులను పెద్ద ఎత్తున సమీకరించి సభను విజయవంతం చేస్తామని అన్నారు.

సీఎం సభ ఏర్పాట్ల నేపథ్యంలో సోమవారం సాయంత్రం సిరిసిల్లలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డిని రాజేందర్‌రావు మర్యాదపూర్వకంగా కలిశారు. సభ నిర్వహణ, ప్రజల తరలింపు తదితర అంశాలపై వారితో చర్చించారు.

కరీంనగర్ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో ప్రజలను సిరిసిల్ల సభకు తరలించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేస్తామని రాజేందర్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ శ్రేణులు సమన్వయంతో పనిచేసి సభకు పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, పలువురు కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

CH Gopalakrishna, Regional Coordinator -Karimnagar

CH Gopalakrishna, Regional Coordinator -Karimnagar

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, కరీంనగర్ ఉమ్మడి జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న సీనియర్ పాత్రికేయులు మరియు ‘రీజినల్ కోఆర్డినేటర్’.