Veernapalli: వీర్నపల్లిలో మహిళను వేధించిన నిందితుడి అరెస్ట్, రిమాండ్!

Veernapalli: వీర్నపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళను లైంగికంగా వేధించిన నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు.

KALEEM, SIRICILLA
Published on: 6 Oct 2026 8:10 PM IST
Veernapalli
X

Veernapalli: వీర్నపల్లిలో మహిళను వేధించిన నిందితుడి అరెస్ట్, రిమాండ్!

Veernapalli: మహిళను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి, న్యాయస్థానం ముందు హాజరుపరచగా రిమాండ్ విధించింది.

వీర్నపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మహిళను లైంగికంగా వేధించినట్లు అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసులో నిందితుడిగా ఉన్న భూక్య నవీన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరించి, చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసిన అనంతరం నిందితుడిని గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది.

మహిళలపై వేధింపులు, లైంగిక దాడులు లేదా ఇతర నేరాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వీర్నపల్లి ఎస్‌ఐ వేముల లక్ష్మణ్ తెలిపారు. మహిళలు తమకు ఎదురయ్యే వేధింపులు లేదా ఇతర నేరాల విషయంలో భయాందోళనలకు గురికాకుండా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని, పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA