Karimnagar: సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు చలి దుప్పట్లు, దోమతెరలు అందించాలి!
Karimnagar: కరీంనగర్ జిల్లాలోని బీసీ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు చలి దుప్పట్లు, కిటికీలకు దోమతెరలు ఏర్పాటు చేయాలని బీసీ డీడీకి USFI నాయకులు వినతిపత్రం అందజేశారు.
Karimnagar: సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు చలి దుప్పట్లు, దోమతెరలు అందించాలి!
Karimnagar: భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యుఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో విద్యార్థులకు దుప్పట్లు అందించాలని బీసీ డీడీ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న బిసి హాస్టల్లకు దుప్పట్లో అందించాలి అదేవిధంగా హాస్టల్ భవనాల కు కిటికీలకు దోమతెరలు ఏర్పాటు చేయాలని, చలికాలం అవుతున్న విద్యార్థుల పట్ల ప్రభుత్వం మరియు అధికారులు నిర్లక్ష్యంగా ఉండడం సిగ్గు చేటు అని అన్నారు.
హాస్టల్ విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడం లో అధికారులు పూర్తి విఫలమయ్యారని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులకు చలి దుప్పట్లు దోమతెరలు ఇతర మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దశల వారి కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు హేమంత్ హరితేజ అరుణ్ స్నేహిత్ అర్జున్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు




