Karimnagar: ప్రకృతి వైపరీత్యాలను సమష్టిగా ఎదుర్కొందాం: నరేందర్‌రెడ్డి

Karimnagar: ఎల్ నినో ప్రభావంతో వాతావరణ విపత్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయని, నీరు, విద్యుత్‌ను పొదుపుగా వాడాలని మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 24 Oct 2026 3:03 PM IST
Karimnagar
X

Karimnagar: ప్రకృతి వైపరీత్యాలను సమష్టిగా ఎదుర్కొందాం: నరేందర్‌రెడ్డి

కరీంనగర్: కరీంనగర్ ఎల్ నినో ప్రభావం వల్ల వాతావరణంలో అనేక మార్పులు వస్తున్నాయని మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. నేడు మీడియాతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వంద దేశాలను ప్రభావితం చేస్తున్న ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల దాదాపు 150 ఏళ్ల తర్వాత తీవ్ర విపత్తు ముప్పు పొంచివుందని తెలిపారు. విపరీతమైన ఉష్ణోగ్రతల వల్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నందున, తాగునీరు, విద్యుత్‌ను ప్రతి ఒక్కరూ అత్యంత పొదుపుగా వాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ సమస్యను కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నెట్టడం బీఆర్‌ఎస్‌ నేతల అవివేకమని తీవ్రంగా ఖండించారు.

రాజీవ్‌ చౌక్‌ సుందరీకరణ పనులకు కేవలం రూ.4 లక్షలే కేటాయించామని, ఇందులో ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదని అన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయమే తనకు శిరోధార్యమని, భవిష్యత్తులో పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ సముచిత న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN