Karimnagar: టెన్త్ విద్యార్థుల ఫీజు చెల్లించిన బండి సంజయ్

Karimnagar: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల 10,959 మంది పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజులను కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెల్లించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 7 Nov 2026 7:12 PM IST
Karimnagar
X

Karimnagar: టెన్త్ విద్యార్థుల ఫీజు చెల్లించిన బండి సంజయ్

కరీంనగర్: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ ఈ ఏడాది పరీక్ష ఫీజును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్వయంగా చెల్లించారు. ఈ మేరకు శనివారం రోజున కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, హనుమకొండ, జగిత్యాల జిల్లాల బీజేపీ ముఖ్య నేతల ఆధ్వర్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లకు చెక్కులను అందజేశారు.మంత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో పార్లమెంట్ పరిధిలోని 10,959 మంది పేద విద్యార్థులకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరనుంది.

జిల్లాల వారీగా విద్యార్థులు. చెల్లించిన మొత్తం వివరాలు...

కరీంనగర్ జిల్లా: 4,356 మంది విద్యార్థులు5,44,500, రాజన్న సిరిసిల్ల జిల్లా: 3,920 మంది విద్యార్థులు (₹4,90,000/-), సిద్దిపేట జిల్లా: 1,133 మంది విద్యార్థులు(₹1,37,140/-), జగిత్యాల జిల్లా: 1,087 మంది విద్యార్థులు (₹1,35,875/-),

హనుమకొండ జిల్లా: 463 మంది విద్యార్థులు (₹57,875/-).

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు , పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు బండి సంజయ్ నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. గతంలో సి ఎస్ ఆర్ నిధులు ఇతర సంస్థల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు గదులు, శౌచాలయాల నిర్మాణం చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. అంతేకాకుండా విద్యార్థులకు ఉచితంగా బ్రాండెడ్ సైకిళ్ల పంపిణీతో పాటు, గత ఏడాది కూడా టెన్త్ విద్యార్థుల పరీక్ష ఫీజును ఆయనే భరించిన విషయాన్ని ప్రస్తావించారు.

పేదరికంలో ఉండి పరీక్ష ఫీజు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల పరిస్థితిని గమనించి, బండి సంజయ్ కుమార్ తక్షణమే స్పందించి ఈ నిధులను విడుదల చేశారని తెలిపారు. కేంద్ర మంత్రి చేసిన ఈ మహత్కార్యం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కోలగాని శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మాజీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ రావు, పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN