Sircilla: సిరిసిల్లలో ఆటో నడిపిన కేంద్ర మంత్రి బండి సంజయ్!
Sircilla: సిరిసిల్ల పర్యటనలో ఆటో నడిపిన కేంద్ర మంత్రి బండి సంజయ్. బీజేపీ కార్యకర్త శ్రీశైలం కొనుగోలు చేసిన నూతన ఆటోను ప్రారంభించి స్వయంగా నడిపిన వైనం.. శ్రేణుల్లో ఉత్సాహం.
Sircilla: సిరిసిల్లలో ఆటో నడిపిన కేంద్ర మంత్రి బండి సంజయ్!
సిరిసిల్ల: సిరిసిల్ల పర్యటనలో కేంద్రమంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ ఆసక్తికరంగా వ్యవహరించారు. బీజేపీ కార్యకర్త శ్రీశైలం కొత్తగా కొనుగోలు చేసిన ఆటోను ప్రారంభించిన బండి సంజయ్.. అనంతరం స్వయంగా ఆటో నడిపారు.
బండి సంజయ్ ఆటో నడపడంతో బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. ఆయన ఆటో నడుపుతుండగా కార్యకర్తలు ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.




