Sircilla: బండలింగంపల్లి మాల సంఘం కాంపౌండ్ వాల్‌కు రూ.3 లక్షల ఎంపీ నిధులు!
Sircilla: ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి మాల సంఘం కాంపౌండ్ వాల్ నిర్మాణానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ నిధుల నుంచి రూ.3 లక్షలు కేటాయించారు.
Sircilla: బండలింగంపల్లి మాల సంఘం కాంపౌండ్ వాల్‌కు రూ.3 లక్షల ఎంపీ నిధులు!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలోని మాల సంఘం కాంపౌండ్ వాల్ నిర్మాణానికి కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తన ఎంపీ నిధుల నుంచి రూ.3 లక్షలు కేటాయించారు.
గతంలో బండలింగంపల్లి గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా మాల సంఘం సభ్యులు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని బండి సంజయ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ విషయాన్ని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన కేంద్ర మంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన బండి సంజయ్ కుమార్ ఎంపీ నిధుల నుంచి రూ.3 లక్షలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
నిధుల కేటాయింపుపై మాల సంఘం సభ్యులు, గ్రామస్తులు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌కు, జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి, వారి సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని బీజేపీ నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతి రెడ్డి, జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి చీకట్ల ప్రవీణ్, మండల ఉపాధ్యక్షులు బైరగోని బాలా గౌడ్, మండల కార్యదర్శి చింతల లహరి, ముడుసు శ్రీనివాసరెడ్డి, సీనియర్ నాయకులు మాచర్ల హరికృష్ణ, చింతల రాజు, చింతల కొండయ్య, బండలింగంపల్లి మాల సంఘం సభ్యులు బైండ్ల యాదగిరి, ఉత్తం శ్రీనివాస్, పిడుసుట్ల నర్సింలు, ఉత్తం కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.




