Karimnagar: కరీంనగర్‌లో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి!

Karimnagar: కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 40-50 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 28 Nov 2026 3:49 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి!

Karimnagar: గుర్తుతెలియని వ్యక్తి మృతి – బంధువుల వివరాల కోసం కరీంనగర్ రూరల్ పోలీసుల విజ్ఞప్త . తేదీ 24-11-2026 న గుర్తుతెలియని వ్యక్తి అనారోగ్యంతో/అపస్మారక స్థితిలో ఉండగా 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం జరిగింది.

అనంతరం మెరుగైన చికిత్స పొందుతూ తేదీ 27-11-2026న మృతి చెందాడు. మృతుడి వయస్సు సుమారు 40 నుండి 50 సంవత్సరాల మధ్యఉంటుందని, అతని శారీరక ఆనవాళ్లు మరియు దుస్తుల వివరాల ఆధారంగా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి తెలిపారు.

ఎవరైనా మృతదేహాన్ని గుర్తించిన వివరాలు తెలుపాలని లేదా పోలీసులకు సమాచారం ఇచ్చి ఈ క్రింది నెంబర్లను సంప్రదించాలని కోరారు. రూరల్ సెల్ నంబర్స్ 8331940590, 8712670764, 9000884443.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR