Karimnagar: పద్మనగర్‌లో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయ నిర్మాణ పనుల పరిశీలన!

Karimnagar: కరీంనగర్ పద్మనగర్‌లో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. 18 నెలల్లో పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ల వెల్లడి.

Velpugonda Ravikumar, Karimnagar
Published on: 22 Oct 2026 9:49 AM IST
Karimnagar
X

Karimnagar: పద్మనగర్‌లో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయ నిర్మాణ పనుల పరిశీలన!

Karimnagar: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణ పనులు కరీంనగర్‌ నగరంలోని పద్మనగర్‌లో ప్రారంభంమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ ఆలయ నిర్మాణ పనులను మాజీ మంత్రి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ నేడు పరిశీలించారు.

నిర్మాణ ప్రాంగణాన్ని సందర్శించి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు. ఆలయ నిర్మాణం ఏ విధంగా కొనసాగుతోంది.. ఇప్పటివరకు ఎంతమేర పనులు పూర్తయ్యాయి.. తదుపరి చేపట్టనున్న పనులు ఏమిటి అనే అంశాలపై కాంట్రాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

నిర్మాణం జరుగుతున్న తీరును నిశితంగా గమనించారు. ఆలయ నిర్మాణానికి సంబంధించిన వివిధ అంశాలపై కాంట్రాక్టర్లతో చర్చించారు. పనుల పురోగతి, నిర్మాణానికి పట్టే సమయం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ పనులు ప్రణాళిక ప్రకారం కొనసాగుతున్న తీరును పరిశీలించారు. నిర్మాణ పనులకు సంబంధించిన వివరాలను కాంట్రాక్టర్లు ఆయనకు వివరించారు.

18 నెలల కాలంలో పూర్తి చేస్తాం

పద్మనగర్‌లో నిర్మిస్తున్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణాన్ని మరో ఏడాదిన్నర కాలంలో పూర్తి చేస్తామని కాంట్రాక్టర్లు గంగుల కమలాకర్‌కు వివరించారు. నిర్ణీత గడువులోగా ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసేలా పనులు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్‌ పార్టీ నగర శాఖ అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌, కొత్తపల్లి బిఆర్‌ఎస్‌ మండల శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ వైస్‌ ఎంపీపీ తిరుపతినాయక్‌, స్థానిక కార్పొరేటర్‌ గడ్డి ప్రదీప్‌, మాజీ కార్పొరేటర్లు వంగపల్లి రాజేందర్‌రావు, బోనాల శ్రీకాంత్‌, మాజీ ఎంపీటీసీ ఒళ్లాల మల్లేశం, దుర్షెడ్‌ మాజీ ఉపసర్పంచ్‌ శుంకిశాల సంపత్‌రావు, మాజీ అర్బన్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ కర్ర సూర్యశేఖర్‌, మాజీ సుడా డైరెక్టర్‌ నేతి రవివర్మ, నాయకులు నూతి చందు, నూతి వెంకటేష్‌, కర్రె అనిల్‌, మంద రాజమల్లు, ఆరె రవిగౌడ్‌, ఆకుల కిరణ్‌, శ్రావణ్‌, దుర్గం మురళి తదితరులు పాల్గొన్నారు.

Velpugonda Ravikumar, Karimnagar

Velpugonda Ravikumar, Karimnagar