Manthani: మంథనిలో పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవం ఘనంగా నిర్వహణ!

Manthani: మంథని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన ఎస్సై సందీప్ కుమార్, పోలీస్ సిబ్బంది. అమరవీరుల స్ఫూర్తితో అంకితభావంతో సేవలందిస్తామని ప్రతిజ్ఞ.

SHANKAR, MANTHANI
Published on: 21 Oct 2026 12:19 PM IST
Manthani
X

Manthani: మంథనిలో పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవం ఘనంగా నిర్వహణ!

Manthani: పోలీస్ స్మారక దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరులకు పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ అధికారులు, సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు. బుధవారం మంథని పట్టణంలోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద పూలు సమర్పించి, అమరవీరులకు సెల్యూట్ చేసి వారి త్యాగాలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల భద్రత కోసం అమరవీరులు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

మంథని పోలీస్ స్టేషన్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ సందీప్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. అమరవీరుల స్ఫూర్తితో ధైర్యం, నిజాయితీ, అంకితభావంతో ప్రజలకు సేవలందిస్తామని ఈ సందర్భంగా పోలీసులు ప్రతిజ్ఞ చేశారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI