Sircilla: ఫూలే వర్ధంతి సందర్భంగా బీసీ స్టడీ సర్కిల్లో ఘన నివాళులు!
Sircilla: రాజన్న సిరిసిల్ల బీసీ స్టడీ సర్కిల్లో మహాత్మా జ్యోతిబా ఫూలే వర్ధంతి నిర్వహించి, ఫూలే దంపతుల సేవలను డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి, సిబ్బంది స్మరించారు.
Sircilla: ఫూలే వర్ధంతి సందర్భంగా బీసీ స్టడీ సర్కిల్లో ఘన నివాళులు!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్లో మహాత్మా జ్యోతిబా ఫూలే 136వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి, సిబ్బంది, విద్యార్థులు మహాత్మా జ్యోతిబా ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా ఫూలే గొప్ప సంఘసంస్కర్త, సామాజిక విప్లవానికి ఆద్యుడని కొనియాడారు. కుల, లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడి సమాజంలో ఆత్మగౌరవ భావనను పెంపొందించారని పేర్కొన్నారు.
విద్య ద్వారానే సమ సమాజ నిర్మాణం సాధ్యమని విశ్వసించి మహిళల విద్యాభివృద్ధికి కృషి చేశారని గుర్తుచేశారు. మహిళా విద్యాలయాలను ఏర్పాటు చేసి ఎంతోమంది మహిళలకు విద్యావకాశాలు కల్పించారని తెలిపారు. బాల్యవివాహాలకు వ్యతిరేకంగా పోరాడటంతో పాటు వితంతు వివాహాలను ప్రోత్సహించారని పేర్కొన్నారు.
మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతులు తమ జీవితాలను సమాజ అభ్యున్నతికి అంకితం చేశారని, వారి సేవలు చిరస్మరణీయమని కొనియాడుతూ ఘనంగా నివాళులర్పించారు.




