Dharmapuri: టిప్పర్ ఢీకొని రిపోర్టర్ భార్య మృతి, భర్తకు తీవ్ర గాయాలు!
Dharmapuri: జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం మారేడుపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. టిప్పర్ లారీ ఢీకొని విలేకరి భార్య ప్రణీత మృతి, విలేకరి కృష్ణ పరిస్థితి విషమం.
Dharmapuri: టిప్పర్ ఢీకొని రిపోర్టర్ భార్య మృతి, భర్తకు తీవ్ర గాయాలు!
Dharmapuri: జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం మారేడు పల్లి గ్రామంలోని ఐకెపి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పేద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొట్లవనపర్తి గ్రామానికి చెందిన ఆవుల కృష్ణ గోదావరి ఖనిలో V5 రిపోర్టర్ గా పని చేస్తున్నాడు.
దీపావళి పండుగ సందర్భంగా గోదావరిఖని నుండి స్కూటీ పై కృష్ణ సతీమణి ప్రణీత తో కలిసి బొట్లవనపర్తికి వస్తుండగా జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం మారేడుపల్లి గ్రామంలోని ఐకెపి సమీపంలో ఎదురుగా వస్తున్న టిప్పర్ డీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాలతో అల్లాడుతున్న ప్రణితను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది.
గాయాలు అయిన కృష్ణకు చికిత్స అందిస్తున్నారు. కృష్ణ-ప్రణీత దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కృష్ణ ప్రణితలది ప్రేమ వివాహం. పండుగపూట స్వగ్రామానికి వస్తూ రోడ్డు ప్రమాదంలో ప్రణీత మృతి చెందడంతో బొట్ల వనపర్తి గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.




