Karimnagar: సీఎం పర్యటన: రేపు కరీంనగర్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Karimnagar: కరీంనగర్‌లో సీఎం పర్యటన దృష్ట్యా రేపు ట్రాఫిక్ ఆంక్షలు ప్రతిమ థియేటర్ నుంచి భగత్‌నగర్ వరకు వాహనాల రాకపోకలపై నియంత్రణ సీపీ గౌష్ ఆలం ప్రకటన.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 29 Sept 2026 9:15 PM IST
Karimnagar
X

Karimnagar: సీఎం పర్యటన: రేపు కరీంనగర్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

కరీంనగర్: ముఖ్యమంత్రి కరీంనగర్ పర్యటన సందర్భంగా రేపు (సెప్టెంబర్ 30, బుధవారం) నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రతిమ థియేటర్ టీ జంక్షన్ నుంచి మమత థియేటర్ మీదుగా భగత్‌నగర్ టీ జంక్షన్ వరకు వాహనాల రాకపోకలను నియంత్రించనున్నట్లు తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లిస్తామని పేర్కొన్నారు.

ప్రజలు ట్రాఫిక్ ఆంక్షలను గమనించి, పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు. వాహనదారులు ముందస్తుగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని తమ ప్రయాణాలను కొనసాగించాలని సూచించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN