Sircilla: బస్సు మలిగేది ఎలా..? సిరిసిల్లలో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు!
Sircilla: సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో నడిరోడ్డుపై వేసిన టెంట్లతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బస్సుల రాకపోకలకు స్థలం లేక ప్రమాద భయం వ్యక్తమవుతోంది.
Sircilla: బస్సు మలిగేది ఎలా..? సిరిసిల్లలో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు!
Sircilla: సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నడిరోడ్డుపై టెంట్లు ఏర్పాటు చేయడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా ఆవిర్భావ వేడుకల సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు టెంట్లు ఏర్పాటు చేయడంతో ప్రధాన కూడలిలో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. ముఖ్యంగా బస్సులు మలుపు తిప్పేందుకు సరిపడా స్థలం లేకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి.
సాధారణంగా వాహనాల రద్దీ ఉండే ప్రధాన కూడలిలో రోడ్డుపై టెంట్లు వేయడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సభలు, వేడుకలు నిర్వహించుకోవడం మంచిదే అయినప్పటికీ, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడకుండా ఏర్పాట్లు చేసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.




