Sircilla: సిరిసిల్లలో నేడు ఘనంగా పట్టణ పద్మశాలి సంఘం కార్యాలయ ప్రారంభం!
Sircilla:సిరిసిల్లలో నేడు పద్మశాలి సంఘం నూతన కార్యాలయం ప్రారంభం. పద్మశాలీల ఐక్యత, సంక్షేమం కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సంఘం ప్రతినిధుల వెల్లడి.
Sircilla: సిరిసిల్లలో నేడు ఘనంగా పట్టణ పద్మశాలి సంఘం కార్యాలయ ప్రారంభం!
Sircilla: పట్టణ పద్మశాలీల ఆత్మగౌరవం, ఐక్యత, సంఘటిత శక్తికి ప్రతీకగా సిరిసిల్లలో పట్టణ పద్మశాలి సంఘం కార్యాలయాన్ని సోమవారం ప్రారంభించనున్నారు. అక్టోబర్ 12న ఉదయం 11:31 గంటలకు చేనేత జౌళి శాఖ పక్కన, శివాలయం–శివనగర్ సమీపంలో కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పట్టణ పద్మశాలి సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమానికి పట్టణంలోని పద్మశాలి కులబాంధవులంతా పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.
సామాన్యుల నుంచి సంపన్నుల వరకు పద్మశాలీలందరిలో ఐక్యతా భావాన్ని పెంపొందించడం, చేనేత కార్మికులు, వ్యాపారుల హక్కులు, సంక్షేమం కోసం సమష్టిగా కృషి చేయడం సంఘం ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఉద్యోగులు, వైద్యులు, న్యాయవాదులు, బ్యాంకర్లు, మహిళలు, యువతతో పాటు వివిధ వృత్తుల్లో ఉన్న పద్మశాలీలందరికీ సముచిత గౌరవం కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
సిరిసిల్లను పద్మశాలీల అడ్డాగా నిలిపిన వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించడంతో పాటు, పద్మశాలీలలో రాజకీయ చైతన్యం పెంపొందించడం, హక్కుల సాధనకు సంఘటితంగా కార్యాచరణ చేపట్టడం లక్ష్యంగా ముందుకు సాగనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రారంభోత్సవానికి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి పద్మశాలి సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాగుల శ్రీనివాస్, మాదాసు శ్రీనివాస్, గుంటుక పురుషోత్తం, జిందం రవీందర్, గాజుల సదానందం, కుందెన సాయి శరత్, తాటి పాముల సత్యనారాయణ, దూడం సురేష్, దాసరి వెంకటేష్, మోర తిరుపతి తదితరులు పాల్గొననున్నారు.




