Sircilla: సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘంలో 2,500 సభ్యత్వాలు పూర్తి!

Sircilla: సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘంలో 2,500 సభ్యత్వాలు పూర్తయినట్లు ప్రతినిధులు తెలిపారు. సంఘం బలోపేతానికి వార్డు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

KALEEM, SIRICILLA
Published on: 1 Nov 2026 7:57 AM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘంలో 2,500 సభ్యత్వాలు పూర్తి!

Sircilla: సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘం కార్యాలయం ప్రారంభమై 18 రోజులు పూర్తయిన సందర్భంగా సంఘంలో ఇప్పటివరకు 2,500 సభ్యత్వాలు పూర్తయినట్లు పట్టణ పద్మశాలి సంఘం ప్రతినిధులు వెల్లడించారు. పట్టణంలోని పద్మశాలి కులబాంధవులందరికీ సంఘం సేవలు అందుబాటులో ఉండేలా వార్డు కమిటీల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

ఇప్పటివరకు మూడు వార్డుల్లో కమిటీల ఏర్పాటు పూర్తయిందని, మిగతా వార్డుల్లోనూ త్వరలోనే కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. వార్డు కమిటీల్లో పనిచేయడానికి ఆసక్తి ఉన్న పద్మశాలి కులబాంధవులను కూడా కమిటీల్లో చేర్చుకుంటామని తెలిపారు. సభ్యత్వాల నమోదు ప్రక్రియను వేగవంతం చేసి, నిర్దేశించుకున్న లక్ష్యాన్ని త్వరితగతిన చేరుకునేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు.

సిరిసిల్ల పట్టణంలోని పద్మశాలీల శ్రేయస్సు, ఐక్యత కోసం వార్డు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. కులబాంధవులందరూ సహకరించి విధిగా సభ్యత్వం తీసుకోవాలని, సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మాదాస్ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు గుంటుక పురుషోత్తం, సహాయ కార్యదర్శి జిందం రవీందర్, కోశాధికారి దాసరి వెంకటేష్, కార్యవర్గ సభ్యులు గాజుల సదానందం, కుందన సాయి శరత్, 35వ వార్డు కార్యదర్శి గజ్జెల్లి శ్రీధర్, సభ్యుడు గజ్జల్లి వేణు తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA