Sircilla: సిరిసిల్లలో పర్యాటక రీల్స్ పోటీల గడువు ఈ నెల 30 వరకు పొడిగింపు!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యాటక ప్రాంతాలపై రీల్స్ పోటీల గడువు ఈ నెల 30 వరకు పొడిగింపు. ప్రకటించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్.
Sircilla: సిరిసిల్లలో పర్యాటక రీల్స్ పోటీల గడువు ఈ నెల 30 వరకు పొడిగింపు!
Sircilla: జిల్లాలోని పర్యాటక, చారిత్రక ప్రాంతాలకు విస్తృత ప్రచారం కల్పించేందుకు నిర్వహిస్తున్న ఉత్తమ రీల్స్, ఎక్కువ వ్యూస్ పోటీల గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.
ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ వద్ద ఉన్న ఫారెస్ట్ అర్బన్ పార్క్, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గుడి చెరువులోని వీటీడీఏ పార్క్, నాంపల్లి గుట్టకు సంబంధించిన ఉత్తమ రీల్స్ రూపొందించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయాలని సూచించారు. ఎక్కువ వ్యూస్ సాధించిన రీల్స్ లింకులను కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలిపారు.
ఫారెస్ట్ అర్బన్ పార్క్, గుడి చెరువు బండ్ పార్క్, నాంపల్లి గుట్టలోని పచ్చదనం, సందర్శకుల సౌకర్యార్థం కల్పించిన మౌలిక వసతులు, అటవీ సంపద తదితర అంశాలను రీల్స్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా ఆయా ప్రాంతాలకు మరింత మంది సందర్శకులు వచ్చేలా అవగాహన కల్పించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.
ఆయా ప్రాంతాల విశేషాలను సృజనాత్మకంగా చిత్రీకరించి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని సూచించారు. పోటీలో అత్యుత్తమంగా రీల్స్ రూపొందించిన వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. మొదటి బహుమతిగా రూ.15 వేలు, రెండో బహుమతిగా రూ.10 వేలు, మూడో బహుమతిగా రూ.5 వేల చొప్పున అందించనున్నట్లు వెల్లడించారు.
పైన పేర్కొన్న పర్యాటక, చారిత్రక ప్రాంతాలపై రూపొందించిన రీల్స్ లింకులను 94402 39783 నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఈ నెల 30వ తేదీలోగా పంపించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.




