Thimmapur: మండల టాపర్ మధుప్రియకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ రూ.10 వేల చెక్కు!

Thimmapur: ఎస్ఎస్‌సీ పరీక్షల్లో తిమ్మాపూర్ మండల టాపర్‌గా నిలిచిన మల్లాపూర్ విద్యార్థిని బుర్ర మధుప్రియకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ రూ.10 వేల చెక్కు అందించింది.

ANJANEYULU, MANAKONDURU
Published on: 27 Nov 2026 8:17 PM IST
Thimmapur
X

Thimmapur: మండల టాపర్ మధుప్రియకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ రూ.10 వేల చెక్కు!

కరీంనగర్ జిల్లా: చదువుకో తెలంగాణ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ప్రతిభ చూపిన విద్యార్థినిని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ఘనంగా సన్మానించింది.

SSC 2025-2026 పరీక్షల్లో తిమ్మాపూర్ మండల టాపర్ గా నిలిచిన మల్లాపూర్ గ్రామానికి చెందిన ప్రతిభావంతురాలైన విద్యార్థిని బుర్ర మధుప్రియ కు రూ.10,000/- (పది వేల రూపాయలు) విలువైన ప్రోత్సాహక చెక్కును అందజేశారు.ఈ చెక్కును శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ DO పల్లె కుమారస్వామి, బొట్టు వెంకటేష్ వర్మ, మధుకర్ రెడ్డి చేతుల మీదుగా అందించడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులు కూడా అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారని, వారిని ప్రోత్సహిస్తే భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకుంటారని అన్నారు. చదువుకో తెలంగాణ కార్యక్రమం ద్వారా ఇలాంటి విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించడం తమ సంస్థ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.మధుప్రియను అభినందిస్తూ, ఆమె ఉన్నత చదువులు చదివి గ్రామానికి, మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థినిని అభినందించారు. మధుప్రియ తల్లిదండ్రులు సంస్థ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU