Thimmapur: ఒలింపిక్స్‌లో స్వర్ణమే లక్ష్యం కావాలి: ఎమ్మెల్యే కవ్వంపల్లి!

Thimmapur: తిమ్మాపూర్ మహాత్మానగర్ బీసీ గురుకులంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఘనంగా ప్రారంభించారు.

ANJANEYULU, MANAKONDURU
Published on: 11 Nov 2026 5:30 PM IST
Thimmapur
X

Thimmapur: ఒలింపిక్స్‌లో స్వర్ణమే లక్ష్యం కావాలి: ఎమ్మెల్యే కవ్వంపల్లి!

తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ లోని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల, కళాశాలలో నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి బీసీ గురుకులాల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పోటీలను ఆయన ప్రారంభించారు.ఈ స్పోర్ట్స్, గేమ్స్ పోటీలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 15 స్కూళ్ల నుంచి 525 మంది బాలికలు 9,10వ తరగతి చదువుతున్న గురుకుల బాలికల ఈనెల 16వ తేదీ వరకు కబడ్డీ,ఖోఖో, వాలీబాల్ తదితర క్రీడాంశాల్లో జరిగే ఈ స్పోర్ట్స్, గేమ్స్ లో పాల్గొంటున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడల్లో భారతదేశం మరిన్ని స్వర్ణ పతకాలు సాధించే దిశగా విద్యార్థులు ఇప్పటి నుంచే కృషి చేయాలని పిలుపునిచ్చారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందించడంతోపాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బూట్లు, సాక్సులు, టైలు అందించడంతోపాటు క్రీడా రంగంలోనూ ప్రోత్సాహకాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ గురుకులాల విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లు, ట్రాక్‌సూట్లు, షూస్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికే కాకుండా మానసిక ఉల్లాసానికి, నాయకత్వ లక్షణాల అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు.

ప్రతిభ, పట్టుదల, ఏకాగ్రతతోపాటు పరస్పర స్నేహభావం, క్రమశిక్షణను క్రీడలు పెంపొందిస్తాయన్నారు.క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ పోటీలు స్నేహపూర్వక వాతావరణంలో సాగాలని సూచించారు. విద్యార్థులు చదువుకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో క్రీడలకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆర్సీఓ అంజలీ దేవి, ప్రిన్సిపాల్ సరిత, వ్యవసాయ కళాశాల ప్రన్సిపాల్ నరసింహా రెడ్డి, స్థానిక సర్పంచ్ పొన్నాల సంపత్, పాక్స్ చైర్మన్లు మోరపల్లి రమణారెడ్డి,గోపు తిరుపతిరెడ్డి, ఒగ్గు దామోదర్,మండల అధ్యక్షులు బండారి రమేశ్, దావు సంపత్ రెడ్డి,కొత్త తిరుపతిరెడ్డి, బుధారపు శ్రీనివాస్, పెరుక రవీందర్, పోలు రమేశ్, రాము,మామిడి అనిల్ కుమార్, చింతల లక్ష్మారెడ్డి, ఎలుక రాజు, రెడ్డిగాని రాజు,ఆశిక్ పాషా,కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU