Sircilla: తంగళ్లపల్లిలో గ్యాస్ సిలిండర్ల దొంగల ముఠా అరెస్టు.. 22 సిలిండర్లు చోరీ!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో ఇళ్ల ఆవరణల్లో గ్యాస్ సిలిండర్లు దొంగిలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Sircilla: తంగళ్లపల్లిలో గ్యాస్ సిలిండర్ల దొంగల ముఠా అరెస్టు.. 22 సిలిండర్లు చోరీ!
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో గ్యాస్ సిలిండర్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తంగళ్లపల్లి కి చెందిన ఆసాని భాస్కర్ రెడ్డి ఈ నెల 3న పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటి కాంపౌండ్‌లో ఉంచిన ఖాళీ ఇండేన్ గ్యాస్ సిలిండర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు గేటు తాళం పగలగొట్టి ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఇంటి పక్కనే నివసించే విశ్వనాధుల ప్రవీణ్‌కు చెందిన గ్యాస్ సిలిండర్‌ను కూడా దొంగిలించినట్లు తెలిపారు.
ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తంగళ్లపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో తంగళ్లపల్లి గ్రామానికి చెందిన కుల్ల ప్రదీప్, మండపల్లి గ్రామానికి చెందిన చిలుక రఘుపతి కలిసి గత మూడు నెలలుగా రాత్రి వేళల్లో రెక్కీ నిర్వహిస్తూ తంగళ్లపల్లి, పద్మానగర్, మండపల్లి గ్రామాల్లో ఇళ్ల ఆవరణలో ఉంచిన గ్యాస్ సిలిండర్లను దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు.
ఇద్దరు నిందితులు మొత్తం 22 గ్యాస్ సిలిండర్లను దొంగిలించినట్లు ఒప్పుకున్నారని సిరిసిల్ల రూరల్ సీఐ కె. నాగేశ్వరరావు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. కేసును ఛేదించి నిందితులను పట్టుకున్న తంగళ్లపల్లి ఎస్‌ఐ అశోక్‌తో పాటు పోలీసు సిబ్బందిని సీఐ కె. నాగేశ్వరరావు అభినందించారు.




