Sircilla: సిరిసిల్ల జిల్లా TGSP 17వ బెటాలియన్‌లో విజయదశమి వేడుకలు!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా సర్దాపూర్ 17వ TGSP బెటాలియన్‌లో విజయదశమి వేడుకలు. కమాండెంట్ ఛటర్జీ ఆధ్వర్యంలో ఆయుధ పూజ, వాహన పూజలు నిర్వహణ.
Sircilla: సిరిసిల్ల జిల్లా TGSP 17వ బెటాలియన్‌లో విజయదశమి వేడుకలు!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా సర్దాపూర్‌లోని 17వ (ఐఆర్) పోలీస్ బెటాలియన్ (టీజీఎస్‌పీ)లో విజయదశమి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బెటాలియన్ కమాండెంట్ పి.జె.పి.సి. చటర్జీ దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బెటాలియన్‌లోని ఆయుధాలు, పోలీసు వాహనాలు, రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్) పరికరాలకు సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు.
విధి నిర్వహణలో ఆయుధాలు, వాహనాలు, విపత్తు నిర్వహణ పరికరాల ప్రాధాన్యతను గుర్తుచేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మి చెట్టుకు పూజలు చేసి విజయదశమి సంప్రదాయాలను పాటించారు.
ఈ సందర్భంగా కమాండెంట్ చటర్జీ బెటాలియన్ అధికారులు, సిబ్బందికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విజయాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. పోలీసు సిబ్బంది ప్రజలకు అంకితభావంతో సేవలందిస్తూ, విధి నిర్వహణలో మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు జె. రాందాస్, సంజీవ రెడ్డి, బెటాలియన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




