Sircilla: సిరిసిల్ల వైద్యుల నిర్లక్ష్యంపై మానవ హక్కుల కమిషన్ సుమోటో!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో కంటి ఆపరేషన్ వికటించి ఎడమ కంటికి బదులు కుడి కంటికి శస్త్రచికిత్స చేసిన ఘటనపై టీజీహెచ్‌ఆర్సీ సుమోటోగా కేసు స్వీకరించింది.
Sircilla: సిరిసిల్ల వైద్యుల నిర్లక్ష్యంపై మానవ హక్కుల కమిషన్ సుమోటో!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కొమ్ము వెంకమ్మకు ఓ ప్రేవేట్ హాస్పిటల్ లో ఎడమ కంటికి బదులుగా కుడి కంటికి శస్త్రచికిత్స చేశారన్న ఆరోపణలపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు స్వీకరించింది. ఈ ఘటనపై వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన కథనాలను కమిషన్ పరిగణనలోకి తీసుకుంది. ఆరోపణలు నిజమైతే వైద్య నిర్లక్ష్యంతో పాటు రోగి భద్రతపై తీవ్ర ఆందోళనలు తలెత్తే అవకాశం ఉందని కమిషన్ పేర్కొంది. శస్త్రచికిత్సకు సంబంధించిన వైద్య రికార్డులు, బాధితురాలి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, ఈ ఘటనపై చేపట్టిన విచారణలో వెల్లడైన అంశాలతో కూడిన సమగ్ర నివేదికను సమర్పించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో)ను ఆదేశించింది. ఈ నివేదికను నవంబర్ 6లోగా సమర్పించాలని టీజీహెచ్‌ఆర్సీ చైర్‌పర్సన్ జస్టిస్ షమీమ్ అక్తర్ ఆదేశాలు జారీ చేశారు.




