Manthani: కులం పేరుతో దూషించారంటూ పుట్టపాక వద్ద ఉద్రిక్తత.. రహదారిపై రాస్తారోకో
Manthani: పుట్టపాక సర్పంచ్ కుటుంబాన్ని కులం పేరుతో దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలని మాదిగ ఐక్యవేదిక మంథని-పెద్దపల్లి రహదారిపై రాస్తారోకో నిర్వహించింది.
Manthani: కులం పేరుతో దూషించారంటూ పుట్టపాక వద్ద ఉద్రిక్తత.. రహదారిపై రాస్తారోకో
పెద్దపల్లి జిల్లా: మంథని మండలం పుట్టపాక వద్ద ఉద్రిక్తత నెలకొంది. పుట్టపాక సర్పంచ్ కన్నూరి రాజబాపు కుమారుడు అభిరామ్‌తో పాటు కుటుంబ సభ్యులను నగరంపల్లి ఉపసర్పంచ్ పోరెడ్డి తిరుపతి రెడ్డి కులం పేరుతో దూషించారనే ఆరోపణలతో మాదిగ సంఘం ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం మంథని–పెద్దపల్లి ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
ఆదివారం జరిగిన ఈ ఘటనకు నిరసనగా సోమవారం ఆందోళనకు దిగిన సంఘం నాయకులు, బాధ్యులైన నగరంపల్లి ఉపసర్పంచ్ పోరెడ్డి తిరుపతి రెడ్డితో పాటు ఆయనకు సహకరించిన వారిపై కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన కొనసాగడంతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
సమాచారం అందుకున్న గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ ధర్నా స్థలానికి చేరుకుని బాధితులు, మాదిగ సంఘం ఐక్యవేదిక నాయకులతో మాట్లాడారు. కులం పేరుతో దూషణలకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు.
ఏసీపీ హామీతో బాధితులు, మాదిగ సంఘం ఐక్యవేదిక నాయకులు ఆందోళన విరమించారు. దీంతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి.




