Karimnagar: కరీంనగర్‌లో ఉద్రిక్తత.. కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్ట్, హౌస్ అరెస్ట్!

Karimnagar: కరీంనగర్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ పర్యటన వేళ సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 23 Nov 2026 12:20 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో ఉద్రిక్తత.. కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్ట్, హౌస్ అరెస్ట్!

Karimnagar: కరీంనగర్లో బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ పర్యటన సందర్భంగా కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేసిన పోలీసులు. కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.

ఈ సందర్భంగా మీడియాతో కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కోర్టు చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహనికి పూలమాలవేసి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హల్ద్వానీ లో పర్యటించిన ప్రాంతాన్ని శుద్ధి చేసి అంటరానితనాన్ని ప్రోత్సహిస్తున్న దానిపై కరీంనగర్ వస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సమాధానం చెప్పాలని అక్కడే మాట్లాడుతామంటే బీజేపీ నేతలు ఎందుకంత ఉలిక్కి పడుతున్నారని నరేందర్ రెడ్డి మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్,మైనారిటీ సెల్ జిల్లా, నగర అధ్యక్షులను మరియు నాయకులను నిన్నటి నుండి పోలీసుల పై ఒత్తిడి పెంచి అరెస్టు చేయిస్తున్నారని,కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ వైఖరి ప్రజలు గమనిస్తున్నారని ఎస్ఐఆర్ పై మాట్లాడినోళ్లంతా దేశ ద్రోహులు అని బండి సంజయ్ కుమార్ మాట్లాడడమేంటని ఓటు హక్కు గురించి ప్రశ్నించిన వాళ్లంతా దేశ ద్రోహులా అని నరేందర్ రెడ్డి ప్రశ్నించారు. ముకరంపుర లోని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కార్యాలయంలో హౌస్ అరెస్ట్ చేసి పోలీస్ బందో బస్తు ఏర్పాటు చేశారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN