Vemulawada: వేములవాడలో విషాదం.. మొక్కుల అనంతరం కుప్పకూలి కోడె మృతి!

Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో కోడె మొక్కు సేవల అనంతరం అలసటతో కోడె మృతి. గోశాలకు తరలిస్తుండగా ఘటన, అధికారుల తీరుపై భక్తుల ఆందోళన.

BABU, VEMULAWADA
Published on: 13 Oct 2026 11:01 AM IST
Vemulawada
X

Vemulawada: వేములవాడలో విషాదం.. మొక్కుల అనంతరం కుప్పకూలి కోడె మృతి!

Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం కోడె మొక్కు సేవల అనంతరం గోశాలకు తరలిస్తుండగా ఓ కోడె ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందింది. ఉదయం గోశాల నుంచి ఆలయానికి తీసుకొచ్చిన సుమారు 40 కోడెల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.

రెండో షిఫ్ట్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కోడెలను ఆలయంలో ఉంచుతున్న నేపథ్యంలో, సుదీర్ఘ సమయం ప్రదక్షిణల వల్ల అలసటకు గురై కోడె మృతి చెంది ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మృతికి అసలు కారణం అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.

కోడె మృతిని మీడియా చిత్రీకరిస్తుండగా ఆలయ సిబ్బంది వీడియోలు తీయొద్దంటు అడ్డుకున్నారు. అనంతరం జేసీబీ సహాయంతో మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు. కోడె మొక్కు సేవల నిర్వహణతో పాటు కోడెల ఆరోగ్యం, సంరక్షణపై కూడా ఆలయ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA