Sircilla: కలెక్టర్, ఎస్పీలకు తెలుగు ఫోక్ అసోసియేషన్ ఆహ్వానం
Sircilla: నవంబర్ 3న జరిగే తెలుగు ఫోక్ అసోసియేషన్, తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ వేడుకలకు రావాలని కలెక్టర్ గరిమ అగర్వాల్, ఎస్పీ మహేష్ గితేలకు ఆహ్వానం అందించారు.
Sircilla: కలెక్టర్, ఎస్పీలకు తెలుగు ఫోక్ అసోసియేషన్ ఆహ్వానం
రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలుగు ఫోక్ అసోసియేషన్ – తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ వేడుకలకు హాజరుకావాలని కోరుతూ జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్, జిల్లా ఎస్పీ మహేష్ బీ. గితేలకు నిర్వాహకులు ఆహ్వాన పత్రికలు అందజేశారు.
శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్, ఎస్పీలను తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రోగ్రాం ఇన్‌చార్జి ఎండీ సత్తార్ మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. నవంబర్ 3వ తేదీన నిర్వహించనున్న తెలుగు ఫోక్ అసోసియేషన్ – తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
తెలుగు ఫోక్ అసోసియేషన్, తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ వేడుకలకు జిల్లా ఉన్నతాధికారులను ఆహ్వానించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫోక్ ఇండస్ట్రీ రాష్ట్ర అధ్యక్షుడు పత్తిపాటి రమణాకర్, ఉపాధ్యక్షుడు జి.ఎల్. నాందేవ్, ప్రచార కార్యదర్శి ఆకునూరి దేవయ్య, గౌరవ సభ్యులు ఎడుమల శ్రీధర్ రెడ్డి, మాట్ల తిరుపతి, నక్క శ్రీకాంత్, మ్యూజిక్ డైరెక్టర్లు కాయితోజు ప్రవీణ్, సాంబారి నవీన్, వేముల సతీష్, శ్రీరాముల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.




